Wrestling | మణికొండ, ఏప్రిల్ 6 : హైదరాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మల్లయుద్ధ పోటీలలో నార్సింగ్ మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన మాచర్ల రవికాంత్ అండర్ 20 విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించి సత్తా చాటాడు. 74 కేజీల విభాగంలో రవికాంత్ స్వర్ణ పథకాన్ని సాధించి రాజస్థాన్ కోటాలో ఏప్రిల్ 20న జరిగే అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో తలపడనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి అండర్ 15, అండర్ 17 లలో రవికాంత్ ఉత్తమ ప్రతిభను కనబరిచి స్వర్ణ పథకాలను కైవసం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు రవికాంతం ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. రాజస్థాన్ కోటాలో జరిగే పోటీలలోను రవికాంత్ కచ్చితంగా స్వర్ణ పథకాన్ని సాధిస్తారని ఖానాపూర్ ఖలీఫా తండ్రి మాచర్ల రాజు, వస్తాద్ రమేష్ ధీమా వ్యక్తం చేశారు.