హైదరాబాద్: వినాయకచవిత ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రులు ముగుస్తుండటంతో అధికార యంత్రాంగం నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగనపతి (Khairatabad Ganesh) కూడా గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో బడా గణపతి దర్శనాలు నేటితో ముగియనున్నాయి. గురువారం అర్ధ రాత్రి వరకే లంబోదరుడిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని తెలిపారు. శనివారం మహా గణపతి నిమజ్జనం సందర్భంగా షెడ్డు తొలగింపు పనులు, క్రేన్ ఏర్పాట్ల కారణంగా శీఘ్ర దర్శనం, సర్వదర్శనాలకు అవకాశం ఉందని చెప్పారు. భక్తులు నిర్వాహకులు, పోలీసులకు సహకరించాలని కోరారు.
గణేశుడి శోభాయత్రి ఇలా..
ఖైరతాబాద్-పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ విగ్రహం మీదుగా గణనాథుడు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాడు.