KCR | వర్ధిల్లు వెయ్యేండ్లు.. వైభవంగా ఉద్యమనేత కేసీఆర్ జన్మదినం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ జన్మదిన వేడుకలు శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు.
- తెలంగాణ భవన్లో ఘనంగా సంబురాలు
- ఆటోడ్రైవర్లకు బీమా పత్రాలు.. దివ్యాంగులకు వీల్ చైర్లు
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 70వ జన్మదిన వేడుకలు శనివారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాలకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సీనియర్ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొకరికి లక్ష రూపాయల కవరేజీతో కూడిన ఇన్సురెన్స్ పత్రాలను, 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్లను మాజీ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు.

కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్‌ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ జీవిత, రాజకీయ, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన ‘అతనే ఒక చరిత్ర’ డాక్యుమెంటరీని వీక్షించారు. ఎంతో గొప్పగా డాక్యుమెంటరీని చేశారని తలసాని సాయి కిరణ్ యాదవ్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

