ఎనిమిదేండ్ల కాలం.. ఎన్నో సత్యాలను, మరెన్నో పాఠాలను నేర్పింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన దక్షతతో పాలనను పరుగులు పెట్టించి, రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. అదే కేంద్రంలోని బీజేపీ నాయకులు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రజలను అధోగతికి తీసుకొచ్చారు. అబద్ధాలు, పిచ్చి ప్రేలాపనలతో మతచిచ్చు పెట్టి కాలం వెళ్లబుచ్చుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన నాయకత్వ ప్రతిభతో దేశానికే దిక్సూచిగా మారారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగులు పెట్టిస్తున్న సుభిక్ష పాలకుడే దేశ రక్షకుడిగా రావాలని ఆకాంక్షిస్తున్నారు. పురపాలనలో వినూత్న పథకాలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పురపాలికల ప్రజాప్రతినిధులు నినదిస్తున్నారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)
పన్నుల పేరుతో పేదల ముక్కుపిండి వసూలు చేస్తూ, పెద్దలకు అప్పనంగా పంచిపెడుతున్న మతోన్మాది పార్టీ బీజేపీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అది పసిగుడ్డు లాంటి తెలంగాణ రాష్ర్టాన్నిఅభివృద్ధి, సంక్షేమంలో నంబర్.1 స్థానంలో నిలిపిన సుభిక్ష పాలకుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మాత్రమే సాధ్యమవుతుందని యావత్ ప్రజానీకం నమ్ముతున్నది. ఉద్యమ నేతను దేశ రాజకీయాల్లోకి రావాలని స్వాగతిస్తున్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం క్షీణత, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం వంటివి నిలిచిపోవాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముక్తకంఠంతో ఆకాంక్షిస్తున్నారు. మోసకారి మోడీ పాలనకు చమరగీతం పాడి, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా
అమలు చేసి యావత్ ప్రపంచం గర్వించేలా దేశాన్ని స్వర్ణయుగం వైపు నడిపించాలని దేశ ప్రజానీకం వేడుకుంటున్నది.
కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి దేశాన్ని పట్టి పీడిస్తున్న మోడీని ఇంటికి పంపాలని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. ఉద్యమ నేత దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం దశ, దిశ మారుతుందని ఆశతో ఉన్నారు. రైతుబంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, ఉచిత కరెంటు, పింఛన్, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇలా అనేక పథకాలు దేశప్రజలకు అందుతాయి.
– ఎం.పావనీజంగయ్య యాదవ్, చైర్పర్సన్, ఘట్కేసర్
కేసీఆర్ నాయకత్వం..దేశానికి అవసరం 
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలకు నిజమైన అర్థం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ప్రజల జీవితాల్లో మార్పు రాకపోవడానికి కారణం ఇప్పటివరకు పాలించిన జాతీయ పార్టీలే. ఇలాంటి పరిస్థితిలో గొప్ప విజన్‌తో రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు అవసరమయ్యే ఎన్నో పథకాలు రూపొందుతాయి. అనేక సమస్యలను పరిష్కరించే నేర్పు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉంది. దేశంలో ప్రజల జీవితాలను మెరుగుపర్చడం ఖాయం.
– గద్వాల్ విజయలక్ష్మి, మేయర్, జీహెచ్ఎంసీ
దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ అందజేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల ప్రజలకు అందుతాయి. రైతులకు, విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశ ప్రజలు ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
– కౌకుట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్, నాగారం
దేశ ప్రజలంతా తెలంగాణ వైపే చూస్తున్నరు
దేశ ప్రజలంతా తెలంగాణ వైపే చూస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ ఫలాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణ అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు కూడా అందించాలని కోరుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన అతితక్కువ సమయంలోనే రాష్ర్టాన్ని దేశంలోనే నం.1 స్థానంలో నిలిపిన కేసీఆర్ లాంటి నేత దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృ ద్ధి పథంలో దూసుకుపోతుంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎంఐఎం పార్టీ తరుఫున కోరుకుంటున్నా.
– అబ్దుల్లా సాది, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, పహాడీషరీఫ్
దేశానికి.. కేసీఆరే శ్రీరామరక్ష
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో అధోగతి పాలవుతున్న దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష. ఆయన నాయకత్వంలోనే దేశం పురోగమిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతం నాశనమవుతుందన్న భ్రమలను తన దార్శనీకతతో చెరిపివేసి, దేశంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఉన్న కేసీఆర్ తన విజన్‌తో దేశాన్ని నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవైపు దేశాన్ని కార్పొరేట్ సంపన్నులకు దోచిపెడుతూ, మరోవైపు పేదలపై ధరల భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేసీఆర్ నాయకత్వంలో దేశంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి. తమను ఎదిరించినవారిపైకి తమ చెప్పుచేతల్లో ఉన్న ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఎగదోస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొడుతూ పబ్బం గడుపుతున్న మోడీకి సరైన ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే. దేశంలో మోడీని ఢీకొట్టగలిగిన ఏకైక నేత కేసీఆరే. ఆయన నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పు తథ్యం.
– మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ
దేశ ప్రజల దృష్టి కేసీఆర్ వైపు మళ్లింది
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది ఏండ్ల కాలంలో దేశాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తున్నది. మోదీ పాలన ప్రజలకోసం కాకుండా నీరవ్‌మోడీ, ఆదాని వంటి బడా పారిశ్రామిక వేత్తల కోసం పనిచేస్తున్నట్లుగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతుండటమే ఇందుకు నిదర్శనం. నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతుండటంతో ప్రజలు మోదీ పాలనపై విసుగు చెందారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్నది. ఇప్పుడు దేశ ప్రజల దృష్టి తెలంగాణ వైపు మళ్లింది. కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి రావాలని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కోరుతున్నారు.
– కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, మేయర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్సుభిక్ష పాలకుడే..
దేశ రక్షకుడు
ఎనిమిదేండ్ల కాలంలోనే పాలనలో బెంచ్‌మార్క్ యావత్ దేశం దృష్టిని ఆకర్శించిన తెలంగాణ మోడల్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే ముక్తకంఠంతో కోరుతున్న ప్రజాప్రతినిధులు
సీఎం కేసీఆర్ పాలనాదక్షతే దిక్సూచి
ఎనిమిదేండ్ల కాలం.. ఎన్నో సత్యాలను, మరెన్నో పాఠాలను నేర్పింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన దక్షతతో పాలనను పరుగులు పెట్టించి, రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. అదే కేంద్రంలోని బీజేపీ నాయకులు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రజలను అధోగతికి తీసుకొచ్చారు. అబద్ధాలు, పిచ్చి ప్రేలాపనలతో మతచిచ్చు పెట్టి కాలం వెళ్లబుచ్చుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన నాయకత్వ ప్రతిభతో దేశానికే దిక్సూచిగా మారారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగులు పెట్టిస్తున్న సుభిక్ష పాలకుడే దేశ రక్షకుడిగా రావాలని ఆకాంక్షిస్తున్నారు. పురపాలనలో వినూత్న పథకాలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పురపాలికల ప్రజాప్రతినిధులు నినదిస్తున్నారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)
పన్నుల పేరుతో పేదల ముక్కుపిండి వసూలు చేస్తూ, పెద్దలకు అప్పనంగా పంచిపెడుతున్న మతోన్మాది పార్టీ బీజేపీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అది పసిగుడ్డు లాంటి తెలంగాణ రాష్ర్టాన్నిఅభివృద్ధి, సంక్షేమంలో నంబర్.1 స్థానంలో నిలిపినసుభిక్ష పాలకుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మాత్రమే సాధ్యమవుతుందని యావత్ ప్రజానీకం నమ్ముతున్నది. ఉద్యమ నేతను దేశ రాజకీయాల్లోకి రావాలని స్వాగతిస్తున్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం క్షీణత, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం వంటివి నిలిచిపోవాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముక్తకంఠంతో ఆకాంక్షిస్తున్నారు. మోసకారి మోడీ పాలనకు చమరగీతం పాడి, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేసి యావత్ ప్రపంచం గర్వించేలా దేశాన్ని స్వర్ణయుగం వైపు నడిపించాలని దేశ ప్రజానీకం వేడుకుంటున్నది.
కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి దేశాన్ని పట్టి పీడిస్తున్న మోడీని ఇంటికి పంపాలని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. ఉద్యమ నేత దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం దశ, దిశ మారుతుందని ఆశతో ఉన్నారు. రైతుబంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు, ఉచిత కరెంటు, పింఛన్, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇలా అనేక పథకాలు దేశప్రజలకు అందుతాయి.
– ఎం.పావనీజంగయ్య యాదవ్, చైర్పర్సన్, ఘట్కేసర్
కేసీఆర్ నాయకత్వం..దేశానికి అవసరం 
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలకు నిజమైన అర్థం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ప్రజల జీవితాల్లో మార్పు రాకపోవడానికి కారణం ఇప్పటివరకు పాలించిన జాతీయ పార్టీలే. ఇలాంటి పరిస్థితిలో గొప్ప విజన్‌తో రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు అవసరమయ్యే ఎన్నో పథకాలు రూపొందుతాయి. అనేక సమస్యలను పరిష్కరించే నేర్పు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉంది. దేశంలో ప్రజల జీవితాలను మెరుగుపర్చడం ఖాయం.
– గద్వాల్ విజయలక్ష్మి, మేయర్, జీహెచ్ఎంసీ
దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ అందజేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల ప్రజలకు అందుతాయి. రైతులకు, విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుంది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశ ప్రజలు ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
– కౌకుట్ల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్, నాగారం
దేశ ప్రజలంతా తెలంగాణ వైపే చూస్తున్నరు
దేశ ప్రజలంతా తెలంగాణ వైపే చూస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ ఫలాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణ అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు కూడా అందించాలని కోరుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన అతితక్కువ సమయంలోనే రాష్ర్టాన్ని దేశంలోనే నం.1 స్థానంలో నిలిపిన కేసీఆర్ లాంటి నేత దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృ ద్ధి పథంలో దూసుకుపోతుంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎంఐఎం పార్టీ తరుఫున కోరుకుంటున్నా.
– అబ్దుల్లా సాది, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, పహాడీషరీఫ్
దేశానికి.. కేసీఆరే శ్రీరామరక్ష
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో అధోగతి పాలవుతున్న దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష. ఆయన నాయకత్వంలోనే దేశం పురోగమిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతం నాశనమవుతుందన్న భ్రమలను తన దార్శనీకతతో చెరిపివేసి, దేశంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఉన్న కేసీఆర్ తన విజన్‌తో దేశాన్ని నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవైపు దేశాన్ని కార్పొరేట్ సంపన్నులకు దోచిపెడుతూ, మరోవైపు పేదలపై ధరల భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కేసీఆర్ నాయకత్వంలో దేశంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి. తమను ఎదిరించినవారిపైకి తమ చెప్పుచేతల్లో ఉన్న ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఎగదోస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొడుతూ పబ్బం గడుపుతున్న మోడీకి సరైన ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే. దేశంలో మోడీని ఢీకొట్టగలిగిన ఏకైక నేత కేసీఆరే. ఆయన నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పు తథ్యం.
– మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్, జీహెచ్ఎంసీ
దేశ ప్రజల దృష్టి కేసీఆర్ వైపు మళ్లింది
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది ఏండ్ల కాలంలో దేశాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తున్నది. మోదీ పాలన ప్రజలకోసం కాకుండా నీరవ్‌మోడీ, ఆదాని వంటి బడా పారిశ్రామిక వేత్తల కోసం పనిచేస్తున్నట్లుగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతుండటమే ఇందుకు నిదర్శనం. నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతుండటంతో ప్రజలు మోదీ పాలనపై విసుగు చెందారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్నది. ఇప్పుడు దేశ ప్రజల దృష్టి తెలంగాణ వైపు మళ్లింది. కేసీఆర్ జాతీయ రాజకీయల్లోకి రావాలని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కోరుతున్నారు.
– కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, మేయర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్
ఉద్యమనేతకు అండగా.. యావత్ ప్రజానీకం
ఎన్నో సాధక, బాధకాలను ఓర్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేత సీఎం కేసీఆర్. స్వరాష్ర్టాన్ని సాధించిన నేతనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పసిగుడ్డులాంటి తెలంగాణను అనతి కాలంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా వాటిని అధిగమిస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్ ముందుచూపే కారణం. మోదీ పాలన అంత అవినీతి మయంగా మారింది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఉద్యమనేతకు యావత్ ప్రజానీకం అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
– సుంకరి క్రిష్ణవేణికృష్ణ, చైర్పర్సన్, దుండిగల్ మున్సిపాలిటీ
కేసీఆర్ రావాలి.. బీజేపీని తరిమి కొట్టాలి..!
మోదీ పాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా బడా పారిశ్రామిక వేత్తలకు అప్పగిస్తూ దేశాన్ని అదోగతిపాలు చేసేలా బీజేపీ పాలన కొనసాగుతున్నది. దేశం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. అది జరగాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. దేశంలో ఉన్న విపక్షాలకు కలుపుకుపోయి.. మతోన్మాది పార్టీ బీజేపీని తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. మోదీ సర్కారు తీసుకొచ్చిన ప్రజావ్యతిరేఖ చట్టాలను తిప్పికొట్టి.. దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
– సన్నా శ్రీశైలంయాదవ్, చైర్మన్, కొంపల్లి మున్సిపాలిటీ
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి
ప్రస్తుత తరుణంలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను సంపన్న వర్గాలకు కట్ట పెడుతున్నది. ఇలాంటి క్రమంలో తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చుదిద్దుతున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– జక్క వెంకట్‌రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ
కేసీఆర్‌తోనే నవ భారత నిర్మాణం సాధ్యం
సీఎం కేసీఆర్ లాంటి తెగింపు ఉన్న నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలు, కార్మికులు, మైనార్టీలు, పేద ప్రజలు బీజేపీ పాలనలో బతకలేకపోతున్నారు. సామాన్య ప్రజల జీవన పరిస్థితి దుర్భరంగా మారింది. సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడి సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వీలుంటుంది. నవ భారత నిర్మాణం కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది. బీజేపీని పాతర వేసే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉంది.
– దుర్గా దీప్లాల్ చౌహన్, మేయర్, బడంగ్‌పేట