ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భవతుల్లో రక్తహీనత,పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భిణులకు “కేసీఆర్ న్యూట్రిషన్ కిట్”లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా రక్తహీనత నమోదవుతున్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్‌లో న్యూట్రిషన్ కిట్లను స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో గర్భిణులకు అందజేశారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో చేప్టటిన ఈ పథకం ద్వారా దాదాపు 1.25 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలువనున్నదని అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్ ఫంక్షన్హాల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్నవ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ క్రాంతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, కిట్‌లోని వస్తువులను చూపిస్తున్న మంత్రి సబితారెడ్డి. చిత్రంలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గర్భిణికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఐటీడీఏ పీఓ అంకిత్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో గర్భిణికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్న ప్రభుత్వవిప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్ రాజ్
ఆదిలాబాద్ కలెక్టరేట్లో గర్భిణికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్‌లో గర్భిణుల వద్దకు వెళ్లి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తున్న మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేవెంకటరమణారెడ్డి