మహేశ్వరం : తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం సీఎంకేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మన్సాన్ పల్లిలో గ్రామ సర్పంచ్ కంది అరుణ రమేష్, జడ్పీచైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి కేక్ కట్‌చేసి మొక్కలను నాటారు.
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఒక పండుగలా మూడు రోజుల నుండి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని ఆమె అన్నారు. సంక్షేమ రంగాలలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్ మండల పార్టీ అధ్యక్షులు అంగోతు రాజునాయక్, మాజీ అధ్యక్షులు హనుమగల్ల చంద్రయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ యాదగిరిగౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు కూనయాదయ్య మాజీ సర్పంచ్ మల్లేష్‌యాదవ్ నాయకులు తొంట రవీందర్, ఏకుల రాములు, రాజుయాదవ్, పబ్బ ఆంజనేయులు పాల్గొన్నారు.