KCR | కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వృక్షారన కార్యక్రమం నిర్వహించారు. జలగం వెంగళరావు పార్కులో 40 కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.ఈ కార్యక్రమానికి సంతోశ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడం జరిగిందని తెలిపారు. పదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. కానీ పదేండ్లలో జరిగిన అభివృద్ధి గడిచిన సంవత్సర కాలంలో చాలా నష్టానికి గురవుతుందని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.
అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు సంతోశ్ కుమార్ మాట్లాడుతూ.. రైతు బంధువు, హరిత ప్రేమికుడు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి వృక్షార్చన ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఇచ్చిన పిలుపు మేరకు మా పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషకరమమని కొనియాడారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, దేవి ప్రసాద్, ముజీవుద్దిన్, గూడూర్ ప్రవీణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ , గెల్లు శ్రీనివాస్, జూలూరి గౌరీ శంకర్, మెట్టు శ్రీనివాస్, సుమిత్ర ఆనంద్, రజిని సాయిచంద్, మంత్రి శ్రీదేవి, మన్నె కవిత, చిరుమళ్ళ రాకేశ్, ఆంజనేయులు గౌడ్, గజ్జెల నగేశ్, వాసుదేవ రెడ్డి, వై సతీశ్ రెడ్డి , పాటిమీది జగన్, ఇంతియాజ్, వల్యా నాయక్, దామోదర్ గుప్తా, కిశోర్ గౌడ్, ఉపేంద్ర, పల్లె రవి, అక్బర్, నాగేందర్ గౌడ్, మఠం భిక్షపతి, వెంకటేశ్వర్ రెడ్డి, సర్వోత్తమ్, మన్నె గోవర్ధన్, తుంగబాలు, గోసుల శ్రీనివాస్, మెట్టు శ్రీనివాస్, శ్రీధర్,
రాఘవేంద్ర యాదవ్, పూర్ణచందర్ , సతీశ్, ఎన్ ఎన్ రాజు, అమృత్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.