బండ్లగూడ : రాజేంద్రనగర్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కాసోజు యాదగిరి (Kasoju Yadagiri) , ఉపాధ్యక్షుడిగా మామిడి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి బందయ్య, సంయుక్త కార్యదర్శిగా కె జ్ఞానేశ్వర్ చారి ఎన్నికయ్యారు. కోశాధికారిగా వి లక్ష్మయ్య, మహిళా కార్యదర్శిగా ఆర్ అనిత, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా కిరణ్ కుమార్, లైబ్రేరియన్ గా అమృత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా భగీందర్ సింగ్, యశ్వంత్, రాజు, రమేష్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.