Hyderabad | కాచిగూడ, జూన్ 6 : మైనర్లు ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయరాదని కాచిగూడ ట్రాఫిక్ సిఐ ఏ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నింబోలిఅడ్డలో మైనర్ల డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండు నెలల వ్యవదిలో కాచిగూడ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 70 మంది మైనర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందులో 24 వాహనాల రిజిస్ట్రేషన్లను సంవత్సరం పాటు రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితులలో వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. మైనర్లు రోడ్లపై ద్విచక్ర వాహనాలను ఇష్టానుసారంగా.. అతీవేగంగా రాంగ్ రూట్లో నడుపుతూ ఇతర వాహనాలకు ఇబ్బందులకు గురి చేస్తూ.. అనేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.