సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): జస్టిస్ కొండా మాధవరెడ్డి 100వ జయంతి సందర్భంగా న్యాయ వ్యవస్థలో అందించిన సేవల గౌరవార్థం ఆయన పేరు మీద పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించనున్నారు. బుధవారం సాయంత్రం గగన్‌మహల్‌లోని ఏవీ కళాశాలలో 4.45 గంటలకు జరిగే కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించనున్నట్లు జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో పాటు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధె, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వి.రాజగోపాల్‌రెడ్డి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ కొండా మాధవరెడ్డి పోస్టల్ కవర్‌ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆవిష్కరించనున్నారు. పలువురు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు హాజరుకానున్నట్లు తెలిపారు.