Bigboss | బంజారాహిల్స్, ఏప్రిల్1: బిగ్‌బాస్ సీజన్-9లో తనకు అవకాశం కల్పించాలంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా దీక్షకు దిగాడు. వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన రామాచారి(28) అనే యువకుడు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు.
తనకు బిగ్‌బాస్ -9లో అవకాశం కల్పించాలంటూ మంగళవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియో వద్ద బైఠాయించాడు. దీంతో స్టూడియో నిర్వాహకులు సమాచారం అందించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని రామాచారిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.