బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్ బస్తీలో కొన్ని వీధుల్లో లోప్రెషర్ సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ జలమండలి అధికారులను కోరారు. శుక్రవారం స్థానికుల ఫిర్యాదుల మేరకు జలమండలి తట్టిఖానా సెక్షన్ మేనేజర్ రాంబాబుతో కలిసి వినాయక్‌నగర్‌లో పర్యటించిన కార్పొరేటర్‌కు స్థానికులు సమస్యలు వివరించారు.
వినాయక్‌నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలోని కొన్ని వీధుల్లో లోప్రెషర్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, తక్కువ ప్రెషర్‌తో వచ్చే నీరు సరిపోవడంలేదని స్థానికులు ఫిర్యాదుచేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అవసరమైతే అత్యవసరంగా కొత్త లైన్ వేయించాలని కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ జలమండలి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.