బంజారాహిల్స్, ఆగస్టు 9 : ‘గత పదేళ్లనుంచి ప్రతి సారీ రాఖీ కట్టేవాళ్లం..’ ‘మమ్మల్నందరికీ సొంతచెల్లెళ్లకంటే ఎక్కువగా చూసుకునేవారు..’ ‘ఏ పండుగ వచ్చినా మా అందరికీ సంతోషాన్ని పంచేవారు..’ ‘మమ్మల్ని ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునేవారు కారు అంటూ..’ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతూ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఫోటోకు శనివారం రాఖీ కట్టారు. శనివారం మాగంటి క్యాంప్ కార్యాలయానికి వచ్చిన రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లకు చెందిన మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏ కష్టమొచ్చినా నేనున్నా అమ్మా.. అంటూ అండగా నిలిచిన గోపన్న మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామంటూ వారు పేర్కొన్నారు.