Jubilee Hills By Poll | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సమయం సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఓటేసేందుకు ఈ ఓటరు స్లిప్‌తో పాటు ప్రభుత్వంచే జారీ చేయబడిన గుర్తింపు కార్డు తప్పనిసరి. నవంబర్ 11వ తేదీన ఈ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఆధార్ కార్డు
జాబ్ కార్డు
బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా బుక్(ఫొటోతో కూడినది)
ఆయుష్మాన్ భారత్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
పాన్ కార్డు
ఇండియన్ పాస్ పోర్టు
పెన్షన్ డాక్యుమెంట్(ఫొటోతో కూడినది)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రయివేటు రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు
యూడీఐడీ కార్డు