మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. ప్రమాదం
మద్యం మత్తులో కారు నడపడంతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌రెడ్డి, సంతోష్, అరవింద్‌తో పాటు మరో యువకుడు కలిసి ఆదివారం రాత్రి కొండాపూర్‌లో జరిగిన విశాల్ అనే స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు.
- డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు
బంజారాహిల్స్, మార్చి 11: మద్యం మత్తులో కారు నడపడంతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌రెడ్డి, సంతోష్, అరవింద్‌తో పాటు మరో యువకుడు కలిసి ఆదివారం రాత్రి కొండాపూర్‌లో జరిగిన విశాల్ అనే స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. పార్టీ ముగించుకుని సోమవారం తెల్లవారుజామున కారులో జూబ్లీహిల్స్ రోడ్ నం. 45 మీదుగా వెళ్తున్నారు. పీకలదాకా మద్యం సేవించిన మల్లికార్జున్‌రెడ్డి అతివేగంగా కారు డ్రైవింగ్ చేయడంతో.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పాటు బీభత్సం సృష్టించింది.
కారు ముందు భాగం తుక్కుతుక్కయ్యింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని.. కారు డ్రైవింగ్ చేసిన మల్లికార్జున్‌రెడ్డితో పాటు అతడితో పాటు ఉన్న మిగిలిన ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా.. అందరు మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన మల్లికార్జున్‌రెడ్డితో పాటు మిగిలిన ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

