Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం నేతలు అరాచకాలు చేస్తున్నారు. షేక్‌పేటలో ఎన్నికల అధికారులను బెదిరిస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.
షేక్‌పేట పరిధిలోని డైమండ్ హిల్స్, అజీజ్ బాగ్, పారామౌంట్ కాలనీ, సమతా కాలనీల్లోని పోలింగ్ బూత్‌ల వద్ద పోలింగ్ ఏజెంట్లను కార్వాన్ ఎమ్మెల్యే మొహియుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం నేతలు బెదిరించి బయటకు పంపించేస్తున్నారు. ఎన్నికల అధికారులను బెదిరించి, ఐడీ కార్డులు లేకుండానే ఓట్లు వేయిస్తున్నారు. ఎంఐఎం ఆగడాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపైనా ఎంఐఎం నేతలు దాడికి దిగారు. జర్నలిస్టుల వద్ద ఉన్న ఫోన్లను లాక్కున్నారు.
Brutal Joke of 144 Section by Karwan MLA Kausar Mohiuddin touring inside Jubilee Hills with a huge mob ..
DGP Shivdhar Reddy failed to conduct a Fair Elections @ECISVEEP pic.twitter.com/ec27XzXOaD
— Dr.Krishank (@Krishank_BRS) November 11, 2025
షేక్‌పేట డైమండ్ హిల్స్‌లో ఓట్ చోరీపై ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే ప్రాంతాల నుంచి బురఖాలో వచ్చిన మహిళలతో దొంగ ఓట్లు వేయించడంపై మండిపడ్డారు. డైమండ్‌హిల్స్ పోలింగ్ బూత్‌ల్లో కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్‌కు దిగుతున్నారని అన్నారు. ఓటర్ ఐడీ కార్డు లేకుండానే బురఖాలో వచ్చిన వారిని లోపలికి పంపించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐడీ కార్డు లేకుండానే పోలింగ్ బూత్‌లోకి ఎలా పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం, పోలీసులు కలిసిపోయి కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అని నిలదీశారు. బోగస్ ఓటింగ్‌కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలేనా అని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా ఎన్నికలు నిర్వహిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#Congress leaders accused of hooliganism in Shaikpet Division.
MLC @DrSravanDasoju reached the spot and discussed the issue with police officials to ensure law and order is maintained.Police have assured swift action and increased deployment in the area.#Hyderabad #Shaikpet… pic.twitter.com/Co20OvDQ4W
— Hyderabad Daily News (@HDNhyderabad) November 11, 2025