BRS | ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్, ఆగస్టు 31 :ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్‌యాదవ్ ఆధ్వర్యంలో 60 మంది యువకులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్దిలో నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నామన్నారు.
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పార్టీలో చేరడం శుభ పరిణామమని అన్నారు. చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్‌యాదవ్ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై యువత బీఆర్ఎస్లో చేరారని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఎమ్మెల్యే సేవలు అందిస్తున్నారన్నారు.
డివిజన్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మద్దతుతో డివిజన్ సమగ్ర అభివృద్ది చేస్తున్నామని, ప్రజల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, యువ నాయకుడు ముద్ద కల్యాణ్‌తో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

