సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరలో జోగినీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వస్తున్న తరుణంలో డిప్యూటీ సీఎం బట్టీ విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శనానికి వచ్చిన నేపథ్యంలో బోనాలతో వచ్చిన జోగినీలు, భక్తులను రోడ్డుపైనే పోలీసులు నిలిపివేశారు.
దాదాపు గంటన్నరపాటు బోనాలతో నిల్చున్న వారంతా సహనం నశించి పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులకు జోగినీలకు మధ్య ఘర్షణ నెలకొంది. గత ప్రభుత్వంలో అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకునేవారమని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నడిరోడ్డుపైనే ఆపేస్తున్నారని వాపోయారు.