Job Mela | అమీర్పేట, ఫిబ్రవరి 10: హైదరాబాద్లోని ఎర్రగడ్డలో ఈ నెల 12వ తేదీన జాబ్ ఫెయిర్ జరగనుంది. రంగారెడ్డి జిల్లా నేషనల్ కెరీర్ సర్వీస్, డాన్ బాస్కో, దిశ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఎర్రగడ్డ రైతు బజార్ ఎదురుగా ఉన్న సెయింట్ థెరిసా చర్చి ఆవరణలోని దిశా కేంద్రంలో మెగా జాబ్ ఫెయిర్ జరగనుంది.
బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు జరిగే ఈ జాబ్ ఫెయిర్లో టెక్ మహీంద్రా, అపోలో, మెడ్ ప్లస్, ఎంపవర్ మెంట్ సర్వీసెస్ సహా పలు ఇంటర్నేషనల్ స్కూల్స్ భాగస్వాములు అవుతున్నాయని జాబ్ ఫెయిర్ కోఆర్డినేటర్ ఐవనో వాజ్ తెలిపారు. ఈ ఫెయిర్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు అభ్యర్థులు 10వ తరగతి మొదలు ఐటీఐ, డిప్లొమో, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. జాబ్ ఫెయిర్లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ప్రాథమిక స్థాయి ఇంటర్వ్యూలు పూర్తిచేసి అక్కడికక్కడే ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు అందిస్తాయని చెప్పారు. మరిన్ని వివరాలకు 98482 73301, 8310133469 నంబర్లలో సంప్రదించాలని కోరారు.