సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): శ్రావణమాసంలో జువెల్లరీ షాపులు సందడి చేస్తున్నాయి. ఈ మాసంలో మహిళలు ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. వారి అభిరుచు లతో పాటు వయసు,వర్కింగ్, డ్రెస్‌ను ఆధారంగా చేసుకుని.. జ్యువెల్లరీని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.
ట్రెండ్ఫాలో..!!
ప్రస్తుతం బోల్డ్, క్లాసిక్ రంగుల మిశ్రమంతో రూపొందించిన ఆభరణాలు, మీనాకారి విడివిడిగా రాళ్లతో తయారుచేసిన ఆభరణాల ట్రెండ్ నడుస్తోంది. వీటితో పాటు డైమండ్, రూబీ లాంటి రంగురాళ్లతో ఆభరణాలు తయారుచేసే క్లాసిక్ డైమండ్ జువెల్లరీ కూడా బాగా ట్రెండ్‌లో ఉంది. రోజ్‌గోల్డ్ కూడా బాగా ప్రాచుర్యంలో ఉందని జ్యువెల్లరీ నిర్వాహకులు రాధిక తెలిపారు. ఇండియన్ స్కిన్టోన్పై బాగా కనిపించేలా రోజ్‌గోల్డ్ ఉంటుంది.
బోల్డ్ ఎలిగెంట్ చోకర్, ఈయర్ రింగ్స్ ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్లూయిడ్ ఫార్మ్ ఆభరణాలు మనసు దోచేస్తున్నాయి. బ్రైడల్ జువెల్లరీలో భాగంగా పాపిడి బిళ్ల, ముక్కుపోగు, జూకాలు, నెక్లెస్, మీడియం నెక్లెస్, చెవి జూకాలు, చెవిపోగులు, దండె కడియాలు, చేతి వంకీలు, వడ్డాణం, గజ్జెలు, మెట్టెలపై మనసు పారేసుకుంటున్నారు. టీనేజీ అమ్మాయిల్లో డెలికేట్ ఆభరణాలు ధరించే ట్రెండ్ నడుస్తోంది.