న్యాయం చేయండి
మహిళా భద్రత, ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులపై నెలల తరబడి ఫిర్యాదులు చేసినా వ్యవస్థ స్పందించకపోవడంతో ఒక భాదితురాలు చివరకు న్యాయం కోసం ప్రజాభవన్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
- ప్రజాభవన్ మెట్లెక్కిన బల్దియా మహిళా ఉద్యోగిని
- జీడిమెట్ల సర్కిల్ డీసీ శంకర్‌సింగ్ వేధిస్తున్నాడని ఆరోపణ
- అధికారుల నిర్లక్ష్యం, మహిళా కమిషన్ ఉదాసీనత
మహిళా భద్రత, ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. ఉన్నతాధికారుల వేధింపులపై నెలల తరబడి ఫిర్యాదులు చేసినా వ్యవస్థ స్పందించకపోవడంతో ఒక భాదితురాలు చివరకు న్యాయం కోసం ప్రజాభవన్‌ను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోన్ జీడిమెట్ల సర్కిల్లో ఎస్ఎఫ్ఏగా పనిచేస్తున్న జీవీఎస్ జానకి మంగళవారం ప్రజావాణి నోడల్ అధికారికి సమర్పించిన వినతిపత్రం మున్సిపల్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
– కుత్బుల్లాపూర్, జూన్ 23
కుత్బుల్లాపూర్, జూన్ 23: 25 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీలో ఎటువంటి మచ్చలేకుండా నిఖార్సయిన సేవలు అందిస్తున్న తనను జీడిమెట్ల సర్కిల్ డీసీ శంకర్‌సింగ్ కావాలనే లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నాడని జానకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తోటి సిబ్బంది ముందే అవమానించడం, మానసిక క్షోభకు గురిచేయడంపై ఇప్పటికే కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌కు రెండు సార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి, రాష్ట్ర మహిళా కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, కమిషన్ నుంచి రాలేదు. గత రెండు నెలలుగా న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే చివరి ఆశగా ప్రజాభవన్‌కు ఆశ్రయించినట్లు భాదితురాలు తన ఫిర్యాదులో తెలిపింది.
కుమార్తె నియామకంపైనా విచారణ చేయాలి
ఈ వేధింపుల వెనుక డీసీ బంధుప్రీతి, అధికార దుర్వినియోగం దాగి ఉందనే అనుమానాన్ని భాదితురాలు వ్యక్తం చేసింది. డీసీ శంకర్‌సింగ్ కుమార్తె ప్రస్తుతం కూకట్పల్లి జోనల్లోని ఎస్ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని, ఆమె నియామకం, కొనసాగింపునకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మంజూరి, అవుట్సోర్సింగ్ రికార్డులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని భాదితురాలు జానకి ప్రభుత్వాన్ని కోరింది.
రక్షణ కల్పించాలని విన్నపం..
తాను ఓ వితంతువునని, ఇద్దరు పిల్లల భాద్యత తనపై ఉందని పేర్కొంటూ.. తన లాగిన్ ఐడీని పునరుద్ధ్దరించి, విచారణ పూర్తయ్యే వరకు తనపై ఎలాంటి ప్రతీకార చర్యలు లేకుండా రక్షణ కల్పించాలని భాదితురాలు ప్రభుత్వాన్ని వేడుకుంది. బల్దియాలోని కొందరు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఉన్నతస్థాయి అధికారులు స్పందించి న్యాయం చేస్తారో..లేదో చూడాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

