సిటీబ్యూరో: దీపావళి పండుగ జీవితాల్లో వెలుగులు నింపాలి. కానీ నిర్లక్ష్యం, చిన్నపాటి తప్పిదాలతో కొందరు కంటి చూపును కోల్పోయి జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపాటి జాగ్రత్తలు, అప్రమత్తతో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలంటూ.. ప్రజలకు సూచిస్తున్నారు కంటి వైద్యనిపుణులు. ఈ దీపావళి సమయంలో ప్రజలు, చిన్నారులు జాగ్రత్తలు పాటించి, ఆనందంగా పండుగను జరుపుకోవాలని సరోజి దేవి కంటి దవాఖాన మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.