హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) మరోసారి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొండాపూర్‌లోని అపర్ణ హోమ్స్‌లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు మహబూబ్‌నగర్, ఏపీలోని గుంటూరులో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని వీ సీడ్స్‌లో, వినుకొండలోని దాల్ మిల్ వ్యాపారి ఇంట్లో సోదాలు చేస్తున్నారు.