సిటీబ్యూరో: నేపాలీ దొంగల ముఠాను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కౌకూర్‌లోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నేపాలీ ముఠా భారీ దోపిడీకి పాల్పడిన ఘటన తెలిసిందే. ఘటన స్థలిలోని ఆధారాలు సేకరించిన పోలీసులు, సీసీ కెమెరాల సహాయంతో వచ్చిన దొంగలంతా నేపాల్‌కు చెందిన వారేనని, ముఠాలో ఏడుగురు సభ్యులున్నారని నిర్ధారించారు.
ఇదంతా పనిమనిషిగా చేరిన మమత గ్యాంగ్పనేనని తేల్చి, స్థానికంగా వారికి సహకరించిన వారిపై నిఘా పెట్టారు. నేపాల్‌కు చెందిన దొంగలు ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్‌కు చేరుకుంటారు. పోలీసులు ముందుగా వారి రూట్‌ను గుర్తించి సరిహద్దులో కాపుకాశారు. యూపీలో దేశ సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తున్న మమత ముఠాను పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.