Akhil | అఖిల్‌కు కొత్త పేరు పెట్టిన అభిమాని.. ‘నాగ అఖిల్’ వెనుక ఉన్న సెంటిమెంట్ తెలిస్తే షాకవుతారు!
Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం 'లెనిన్' జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.
Akhil | అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల సందడితో ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల్, నాగార్జున, చిత్రబృందం మాట్లాడిన విషయాలకంటే… ఓ అక్కినేని అభిమాని చేసిన వినూత్న ప్రయత్నమే అందరి దృష్టిని ఆకర్షించింది. అఖిల్‌కు కొత్త పేరును సూచిస్తూ అతడు చెప్పిన సెంటిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోలు కెరీర్ బాగా సాగాలని లేదా జ్యోతిష్య సూచనల మేరకు తమ పేర్లలో అక్షరాలు జోడించడం, మార్చుకోవడం చూస్తుంటాం. అయితే ఇక్కడ మాత్రం అభిమానినే స్వయంగా అఖిల్‌కు కొత్త పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. అతడు సూచించిన పేరు ‘నాగ అఖిల్స. మొదట ఈ పేరు వినగానే సాధారణంగా అనిపించినా, దాని వెనుక ఉన్న భావాన్ని వివరించడంతో ఈవెంట్‌కు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు. అభిమాని చెప్పిన ప్రకారం ‘నాగ అఖిల్’ అనే పేరులో అక్కినేని కుటుంబానికి చెందిన నలుగురు ప్రముఖుల పేర్లను ప్రతిబింబించేలా అక్షరాలను ఎంపిక చేశారట. ‘నాగ’ – అక్కినేని లెజెండ్ నాగేశ్వరరావు పేరు నుంచి, ‘అ’ – నానమ్మ అన్నపూర్ణమ్మ పేరు నుంచి, మళ్లీ ‘నాగ’ – తండ్రి నాగార్జున పేరు నుంచి, అ’ – తల్లి అమల పేరు నుంచి తీసుకోవడం జరిగిందని అన్నారు.
ఈ నలుగురి పేర్ల స్ఫూర్తి, ఆశీస్సులు ఎప్పుడూ అఖిల్‌తో ఉండాలని భావించి ‘నాగ అఖిల్’ అని పేరు పెట్టినట్లు ఆ అభిమాని తెలిపాడు. ఈ సెంటిమెంట్‌కు అక్కడున్న అభిమానులు ఫిదా అయ్యారు. అక్కినేని కుటుంబంలో ‘నాగ’ అనే పదానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య… ఇలా కుటుంబంలోని పలువురి పేర్లలో ‘నాగ’ ఉండటం తెలిసిందే. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అఖిల్ పేరుకు కూడా ‘నాగ’ను జోడించాలని అభిమాని చేసిన సూచన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పలువురు అభిమానులు కూడా ‘నాగ అఖిల్’ పేరు బాగుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే ‘లెనిన్’ సినిమా ఘన విజయం సాధిస్తే ఈ కొత్త పేరు మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- fan
- Lenin
- naga akhil
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

