Lenin | అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన లాంగ్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’ విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులు, చిత్ర బృందం, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి కింగ్ నాగార్జున. తనదైన స్టైల్లో మాట్లాడిన ఆయన, అఖిల్ సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగార్జున మాట్లాడుతూ… నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు చెప్పే మాట ఒకటి ఉంటుంది. ‘వస్తున్నాం… కొడుతున్నాం’ అని. కానీ ఈసారి ఆ డైలాగ్‌ను కాస్త మార్చి చెబుతున్నా. ‘జూలై 10న వస్తున్నాం… మనోడు కొడుతున్నాడు'” అంటూ స్టేజ్‌పైనే బ్లాక్‌బస్టర్ హుకుం జారీ చేశారు. ఆయన మాటలకు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. అభిమానులు హర్షధ్వానాలతో ఈ వ్యాఖ్యలను స్వాగతించారు. నాగార్జున మాటల్లో కనిపించిన ధీమా, అఖిల్‌పై ఉన్న నమ్మకం చూసి అక్కినేని అభిమానుల్లో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. సోషల్ మీడియాలో కూడా ఆయన వ్యాఖ్యల వీడియోలు వైరల్ అవుతుండగా, “మనోడు కొడుతున్నాడు” అనే డైలాగ్ ట్రెండింగ్‌గా మారింది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను తీసుకురాగా, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ కథతో రూపొందిన ఈ చిత్రం అఖిల్ కెరీర్లో కీలక చిత్రంగా భావిస్తున్నారు. గత సినిమాల కంటే పూర్తి భిన్నమైన మాస్ అవతార్‌లో అఖిల్ కనిపించనున్నాడనే టాక్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని ఎమోషన్, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించినట్లు ఇప్పటికే ప్రచార చిత్రాల ద్వారా స్పష్టమైంది. సినిమా టీమ్ కూడా ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది.మొత్తానికి తిరుపతి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాగార్జున చేసిన ఒక్క స్టేట్మెంట్తో ‘లెనిన్’ సినిమాపై ఉన్న హైప్ మరింత రెట్టింపైంది.