అక్షరాలు రాని వయసులో అద్భుత ప్రతిభ

అక్షరాలు నేర్చుకునే వయసు కూడా లేదు.. అయినా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుందో చిన్నారి. బుడిబుడి అడుగులు వేసే వయసులో అద్భుత జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, దమ్మాయిగూడకు చెందిన ఐశ్వర్య తన ప్రతిభతో అపర మేధావిగాకీర్తిపొందుతున్నది.
తడబడకుండా..
2018లో ముత్యం సుప్రియ, రాఘవేందర్ దంపతులకు ఐశ్వర్య జన్మించింది. అమ్మ, నాన్న, అత్త వంటి పదాలకే పరిమితమైన ఏడాదిన్నర వయసులో తల్లి శిక్షణతో రైమ్స్‌ను స్పష్టంగా చెప్పే స్థాయికి చేరుకున్నది. బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఐశ్వర్య ప్రతిభను చూసి ప్రశంసించే వారు. దీంతో సుప్రియ తన కూతురును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి, మరింత తర్ఫీదునిచ్చారు.
అద్భుత జ్ఞాపకశక్తితో..
తల్లి సుప్రియ శిక్షణతో చిన్నారి ఐశ్వర్య తన అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని కైవసం చేసుకుంది. తల్లిదండ్రులు తమ కూతురు ప్రతిభా పాటవాలను తెలియజేసేందుకు ఐశ్వర్య చెప్పిన ఆరు వాహనాలు, మూడు పక్షులు, పన్నెండు రంగులు, ఎనిమిది కూరగాయలు, ఆరు పండ్లు, 18 తినుబండారాలు, 44 వస్తువులు, 33 బొమ్మలు, 27 జంతువులు, ఐదుగురు దేవుళ్ల పేర్లు, ఇంగ్లిషు అక్షరాలు ఇలా వివిధ అంశాలను రికార్డు చేసి పంపగా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతిభను గుర్తించి.. ఐశ్వర్యకు పతకం, ప్రశంసాపత్రం అందించింది. బడికి వెళ్లకుండానే తల్లి శిక్షణలో ఐశ్వర్య ఈ ఘనతను సాధించిందని తండ్రి ముత్యం రాఘవేందర్ చెప్పారు. తన కూతురు ప్రతిభకు మరింత పదునుపెట్టి, భవిష్యత్‌లో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

