Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
Supreme Court: డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుతున్న అంశంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.చదువుకున్నవారు మొబైల్ ఫోన్లలో ఎలా డిజిటల్ అరెస్టు అవుతున్నారని కోర్టు షాక్ వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్టు కేసులు పెరుగుతున్న అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది.చదువుకున్నవారు మొబైల్ ఫోన్లలో ఎలా డిజిటల్ అరెస్టు అవుతున్నారని కోర్టు షాక్ వ్యక్తం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించినా ఎలా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం విస్మయానికి గురైంది. డిజిటల్ అరెస్టులపై సుమోటో కేసులో సుప్రీం వాదనలు విన్నది. ఈ నేపథ్యంలో సీజేఐ సూర్యకాంత్ స్పందిస్తూ.. అసలు ఈ బాధితులతో ఏం జరుగుతోంది, ఎలా బాధితులు ట్రాప్ అవుతున్నారని ఆయన వాదనల సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. చాలా బేసిక్ విషయం కూడా వాళ్లకు అర్థం కాదా, ఫోన్లో భయపెట్టి డిజిటల్ అరెస్టు చేస్తారా అని ఆయన అన్నారు.
ప్రజల్లో ఏదో పొరపాటు జరుగుతోందని, అదేంటో దేవుడికే తెలియాలని, ప్రజాస్వామ్య దేశంలో ఫోన్ ద్వారా అరెస్టు అవుతున్నారంటే మీరేంటో ఆలోచిస్తున్నారా అని సీజేఐ అన్నారు. డిజిటల్ ఫ్రాడ్ కేసుల్లో బ్యాంకులు బాధ్యత తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. కస్టమర్లకు బ్యాంకులు ఓ రక్షణకవచంలా ఉండాలన్నారు. పదవీవిరమణ చేసిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో విత్‌డ్రా జరుగుతుంటే, ఎందుకు బ్యాంకులు జోక్యం చేసుకోవడం లేదని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది.
అయితే అనుమానిత లావాదేవీలను బ్యాంకులు గుర్తిస్తున్నాయని, నేరాల జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టులో తెలిపారు. ప్రజలతోనే ఏదో తప్పు ఉందని, దేవుడికే ఆ విషయం తెలియాలని, మీకు మీరు బాధితులవుతున్నారని, విద్యావంతులు ఫ్రాడ్‌కు గురవుతున్నారని తెలుసుకోవడం ఆందోళన కలిగిస్తోందని సీజేఐ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

