ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
విద్యార్థుల్లో పని సంస్కృతిని పెంపొందించడంతో పాటు, చదువుకుంటూనే ఉపాది పొందే అవకాశాన్ని కల్పించేందుకు నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ఎర్న్ వైల్ యు లెర్న్' కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఖాళీ సమయాల్లో...
– ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రమకు తగిన పారితోషికం పొందుతున్న వర్సిటీ విద్యార్థులు
రామగిరి, అక్టోబర్ 29 : విద్యార్థుల్లో పని సంస్కృతిని పెంపొందించడంతో పాటు, చదువుకుంటూనే ఉపాది పొందే అవకాశాన్ని కల్పించేందుకు నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఖాళీ సమయాల్లో, సెలవు రోజుల్లో పని చేసే అవకాశం కల్పిస్తూ, వారు చేసిన శ్రమకు తగిన పారితోషికం అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంజీయూ క్యాంపస్‌కు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్యాంపస్ లోని మౌలిక వసతులకు సంబంధించిన పనుల్లో భాగస్వాములవుతూ తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పనిలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా బాధ్యత, క్రమశిక్షణ, సమష్టి కృషి వంటి లక్షణాలను అలవర్చుకుంటున్నారు. మరోవైపు, తమ శ్రమకు పారితోషికం లభించడం విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
చదువుతో పాటు ఉపాది : ప్రొఫెసర్ ఆకుల రవి
సాధారణంగా విద్యార్థులు చదువుకే పరిమితమవుతున్న నేపథ్యంలో వారికి ఆర్థికంగా కొంత తోడ్పాటు అందించడంతో పాటు, శ్రమ విలువను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డైరెక్టర్ ఆకుల రవి ఆలోచనతో అమలు చేస్తున్నాం. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ఎంతో మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుండడం సంతోషాన్ని కలిగిస్తుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

