కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కీలకంగా మారుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ అన్నారు. గురువారం వైరా, కొణిజర్ల మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న...
వైరా టౌన్, అక్టోబర్ 29 : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కీలకంగా మారుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ అన్నారు. గురువారం వైరా, కొణిజర్ల మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఆరేండ్లకు ఒక్కసారిగా వచ్చే ఈ ఎన్నిక రాష్ట్రంలో కీలకంగా మారుతుందని, మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలన పట్ల గ్రాడ్యుయేట్ ఓటర్లు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. కాంగ్రెస్ బుద్ధిమాలిన పాలన కొనసాగిస్తుందని, ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు తాండవిస్తుందని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. వ్యవసాయానికి సాగునీరు అందించలేని ఈ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారని, ఆంధ్ర ప్రాజెక్టులు నిండుకుండలా ఉంటే తెలంగాణ ప్రాజెక్టులు వెలవెలబోతూ నెర్రెలు బారాయన్నారు. అనంతరం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల అధ్యాపక బృందంతో మాట్లాడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని కోరారు.

కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బానోత్ చంద్రావతి, లకావత్ గిరిబాబు, జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావ్, బాణాల వెంకటేశ్వర్లు, వనమా విశ్వేశ్వరరావు, భూమాత కృష్ణమూర్తి, కామినేని శ్రీనివాసరావు, కౌన్సిలర్ దొంతబోయిన వెంకటేశ్వర్లు, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీను, మద్దెల రవి, బానోత్ సక్కుబాయి, మాదినేని దుర్గాప్రసాద్, పాసంగలపాటి శివ, రాచబంటి బాలకృష్ణ, దాసరి శ్రీనివాసరావు, తిరుపతి శ్రీను, మిట్టపల్లి సత్యంబాబు, మెట్టుపల్లి కిరణ్, వజినేపల్లి చక్రవర్తి, ఆదూరి ప్రేమ్ కుమార్, గుజ్జర్లపూడి దేవరాజ్, వల్లబి శ్రీను, మండెం కృష్ణంరాజు, మన్యం సత్యానందం, వాసిరెడ్డి రవి, వాంకుడోత్ వీరన్న, బత్తుల రాజు, కమార్తపు ప్రవీణ్, వేముల శివకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
కేటీఆర్‌తో హ్యాండ్లూమ్ సొసైటీ న్యూఢిల్లీ బోర్డు మెంబర్ వజ్రమ్మ మర్యాదపూర్వక భేటీ
NIMS Raids | నిమ్స్ లో అవినీతి ఆరోపణలు.. ఒకేసారి మూడు శాఖల అధికారుల సోదాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

