సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): అంతరాష్ట్ర ముఠాలు సిటీలో అక్రమాయుధాలతో హల్‌ఛల్ చేస్తున్నాయి. పట్టపగలు బంగారం దుకాణాలపై గురిపెడుతూ అడ్డొస్తే తుపాకుల మోత మోగిస్తున్నారు. ఇలాంటి ముఠాలకు అక్రమాయుధాలను విక్రయించేందుకు అంతరాష్ట్ర ముఠాలు సిద్దంగా ఉంటాయి. హైదరాబాద్‌లో ఇలాంటి గన్స్ విక్రయ ఘటనలు పలు బయట పడ్డాయి. గన్ కల్చర్ పెరుగుతుండడం, యధేచ్చగా నేరస్థులు గన్స్ వాడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. మరో పక్క హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటూ అంతరాష్ట్ర ముఠాలు అక్రమాయుధాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఇలాంటి ఘటనలు పట్టుబడేటివికొన్నే ఉంటున్నాయని, పోలీసు నిఘాకు చిక్కకుండా అమ్మే ముఠాలు నగరంలో చాలనే ఉండే అవకాశాలున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. భిన్న రంగాలలో హైదరాబాద్ వ్యాపార కేంద్రంగా మారడం వివిధ రాష్ర్టాలకు చెందిన పౌరులు నగరానికి జీవనోపాధికి వస్తుంటారు. ఇలాంటి వారిలో కొందరు తమ స్వస్థలాలలో ఉండే అక్రమాయుధాల తయారీ, ప్రధాన విక్రయ ముఠాలతో చేతులు కలుపుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడుండే పరిస్థితులను అర్ధం చేసుకుంటూ, గన్స్ విక్రయానికి అదునైన స్థలంగా భావిస్తూ, గన్ విక్రయా ముఠాలతో కలిసిపోతున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇలా అక్కడి నుంచి అక్రమమార్గంలో గన్స్ హైదరాబాద్‌కు రవాణా చేస్తూ ఇక్కడ వాటిని విక్రయిస్తున్నారు.
ఏడాది కాలంలో ఒక్క రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 15 అక్రమాయుధాలను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకొని ఆయా ముఠాలను అరెస్ట్ చేశారు. ఇవి పోలీసు నిఘాకు భయటపడ్డ ఘటనలు నిఘాను పటిష్టం చేస్తూ ఔటర్ లోపల మరిన్ని ముఠాల గుట్టు రట్టయ్యే అవకాశాలున్నాయి.
తాజాగా చందానగర్‌లో జరిగిన ఖాజన జ్యువెలర్స్ దోపిడీకి పాల్పడ్డ ముఠా నాలుగు పిస్టోల్స్‌ను వాడినట్లు పోలీసుల ప్రాధమికంగా గుర్తించారు. గతంలో ఒక గన్‌తో వెళ్లాలంటేనే అంతరాష్ట్ర ముఠాలలో వణుకు పుట్టేది, నేడు ఒకే ముఠాలోని సభ్యులందరు గన్స్ పెట్టుకొని తిరిగే స్థాయికి పరిస్థితి వచ్చిందంటూ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక ముఠాలోని సభ్యులందరి వద్ద అక్రమాయుధాలుంటే ఎంత ప్రమాదమో ఉహంచలేకపోతున్నామంటూ సామాన్య పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు, గత ఏడాది ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వెలుగు చూసిన తుపాకీ కాల్పులు, అక్రమాయుధాల అరెస్ట్ వంటి ఘటనలతో గన్ కల్చర్ రోజు రోజుకు హైదరాబాద్‌లో పెరుగుతుందని సామాన్యపౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అంతరాష్ట్ర ముఠాలు తుపాకులతో స్వైర విహారం చేస్తున్నా పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టి ఆయా ముఠాలను నిలువరించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నేరస్థుల చేతికి అక్రమాయుధాలు వెళ్లడం వల్ల దోపిడీలు.. బెదిరింపులు.. కిడ్నాప్.. హత్యలు.. సెటిల్మెంట్లు.. రౌడీయిజం పెరుగుతుందని, తద్వారా హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు మరింత సమస్యగా మారే ప్రమాదం ఉందని సామాన్యులు హెచ్చరిస్తున్నారు.
ఒక గన్ ఉంటే.. ఈజీగా అవతలి వాళ్లను భయపెట్టించి తమ పని పూర్తిచేసుకోవచ్చనే బావనతో నేరస్తులు కంట్రీమేడ్ పిస్టోల్స్‌ను వాడుతుంటారు. దీనిని ఆసరగా చేసుకుంటున్న యూపీ, బీహార్ ప్రాంతాలకు చెందిన ముఠాలు కంట్రీ మేడ్ పిస్టోల్స్ అక్కడ తక్కువ ధరకు కొని, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. అంతరాష్ట్ర ముఠాల నుంచి స్థానికంగా ఉండే నేర ప్రవత్తి కల్గిన వాళ్లు ఆ గన్స్ కొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూపీ, బీహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాదీ రాష్ర్టాల నుంచి వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లే ఇక్కడ గన్స్కు ఉండే గిరాకీని అంచనా వేస్తూ అక్రమాయుధాల విక్రయంలోకి వెళ్తున్నారు. అక్రమాయుధాల విక్రయ ముఠాలు అరెస్ట్ రాచకొండ ఎస్ఓటీ పోలీసులు శివారు ప్రాంతాలలో గన్స్ విక్రయానికి సంబంధించిన సమాచారం అందుకొని ఆయా ముఠాలను పట్టుకున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మూడు ఘటనలలో సుమారు 15 నాటు తుపాకులు
చందానగర్‌లో జరిగిన ఖజాన జ్యువెలరీ దోపిడీ ఘటనలో ఆరుగురు అగంతకులు పాల్గొన్నారు. అందులో నలుగురు గన్స్ వాడినిట్లు ప్రాధమిక ఆధారాలు పోలీసులకు లభించాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన ఈ అంతరాష్ట్ర ముఠాలు గన్స్‌తో ఇక్కడకు వచ్చారా? ఇక్కడకు వచ్చిన తరువాత గన్స్ కొన్నారా? అనే విషయాలు నిందితుల విచారణలో వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఇక్కడ నిందితులు వాడినవి నాలుగు ఒకేరకంగా ఉన్న పిస్టోల్స్గా పోలీసులు అనుమానిస్తున్నారు. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందన అంతరాష్ట్ర ముఠాలే ఈ ఘటనకు బాధ్యులని పోలీసులు భావిస్తున్నారు, అయితే ఆయా ప్రాంతాలకు చెందిన ముఠాలే గతంలో అక్రమాయుధాలను విక్రయిస్తూ పట్టుబడ్డ ఘటనలున్నాయి. దీంతో ఇప్పుడు ఖజాన జ్యువెలరీ దోపిడీలో అగంతకులు వాడిని గన్స్ విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.