Hyderabad | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా పట్టివేత.. ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొండాపూర్, అక్టోబర్ 28 : అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితులు, దొంగిలించిన ఐదు ద్విచక్ర వాహనాలు, 11 నకిలీ నంబర్ ప్లేట్లు, తాళాలు తెరిచేందుకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 27, 28 తేదీల మధ్య రాత్రి లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌ను వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను దొంగిలించినట్లు వెల్లడైంది. మరింత లోతుగా విచారించగా.. నిందితులు మరో ముగ్గురితో కలిసి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు.
అదుపులోకి తీసుకున్న వారిలో రాజమండ్రికి చెందిన గడ్డం ప్రవీణ్ (21), బురిడి గోపీచంద్ (20), చోడవరపు దినేశ్ కుమార్ (22), గీసాల షణ్ముఖ సత్యసాయి (21), సీరపు దినేశ్ కుమార్ (22)లు ఉన్నారు. డిసెంబర్ 2025 నుంచి సైబరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలించి, నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చి రాజమండ్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. వీరి నుంచి మూడు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు, ఒక కేటీఎం డ్యూక్ సహా మొత్తం ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతర దొంగతనాలు, మిగిలిన వాహనాల ఆచూకీపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP MLC: వారణాసి ఎమ్మెల్సీ సీటు సమాజ్‌వాదీ పార్టీ వశం
Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

