అమీర్‌పేట్ ఏప్రిల్ 29: యునైటెడ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో మే 23 నుంచి మూడు రోజులపాటు బి2బి హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో 2025 జరుగునుంది. శంషాబాద్‌లోని జీఎంఆర్ అరేనాలో జరిగే ఈ జ్యువెలరీ షోకు సంబంధించిన వివరాలను మంగళవారం అమీర్‌పేట్‌లోని హోటల్ మారిగోల్డ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో యునైటెడ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ జ్యువెలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ తయాల్ వెల్లడించారు.
వారు మాట్లాడుతూ.. 1.5 లక్షల చ. అడుగుల విస్తీర్ణంలో దేశ నలుమూలకు చెందిన ప్రఖ్యాత జ్యువెలరీ సంస్థలు 700 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయని, ఈ స్టాండ్ల ద్వారా 15 లక్షల పైగా నగల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జ్యువెలరీ షో వాల్‌పోస్టర్‌ను అతిథులు ఆవిష్కరించారు.