Bachupally : బాచుపల్లి పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంజునాథ్ (15) అనే విద్యార్థి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.
తమ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థినిని మంజునాథ్ ప్రేమిస్తుడాని.. ఈ విషయం తెలిసి అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరించడంతోనే మంజునాథ్ బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. మంజునాథ్ కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.