నేటి నుంచి ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.
- హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 197 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- ఏర్పాట్లు చేసిన జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు విడతలలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 114 కేంద్రాలు, రెండవ విడతలో 43 కేంద్రాలు, మూడో విడతలో 40 పరీక్షా కేంద్రాలలో పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 36,243 మంది సైన్స్ విద్యార్థులు, 24,242 మంది ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు.
నాలుగు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు 106 ప్రైవేటు కళాశాలలకు డిపార్టెంటల్ ఆఫీసర్స్‌ను నియమించారు. విద్యార్థులు నిర్దేశిత టైం టేబుల్ ప్రకారంగా పరీక్షలకు హాజరుకావాలని, హాల్ టికెట్స్‌పై సంబంధిత ప్రిన్సిపాల్ సంతకం లేకున్నప్పటికీ పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించాలని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.ఒడ్డెన్న తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

