హైదరాబాద్ ఆట ప్రతినిధి, జనవరి 1: తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా తైక్వాండో ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హైదరాబాద్ జిల్లా జట్టు సొంతం చేసుకోగా మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా జట్టు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జూనియర్ టైటిల్‌ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జట్టు దక్కించుకోగా రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా జట్లు రెండు, మూడు స్థానాలను చేజిక్కించుకున్నాయి. చాదర్‌ఘాట్ విక్టోరియా మెమోరియల్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ పి.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, టీఎస్ఎఫ్ చైర్మన్ చాతిరి బాబురావు సాగర్, తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ కోశాధికారి కె.మహేశ్వర్ సాగర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ఆర్.ప్రేమ్‌రాజ్, తైక్వాండో కార్యనిర్వాహక కార్యదర్శి డి.సురేశ్ బాబు, ప్రతినిధులు జయంత్ రెడ్డి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.