హైదరాబాద్/సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, సూల్వ్యాన్లను నిరవధికంగా బంద్ చేయనున్నట్టు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. బంద్‌కు బీపీటీఎంఎం, బీఆర్టీయూ, బీఎంఎస్, సీఐటీయూ, టీయూసీఐ, టీఎన్టీయూసీ వంటి కార్మికసంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుతో ఆటోడ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లకు ఏటా ఇస్తామన్న రూ.12 వేల ఆర్థికసాయం, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమబోర్డు ఏర్పాటు, రాష్ట్రవ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, సూల్ వ్యాన్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. బంద్‌కు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీఏ కార్యాలయాల్లో కార్పొరేట్ రేడియం దందాను అరికట్టాలని కోరారు. దీనిపై ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, అనవసరపు రేడియంతో ఆర్థికంగా మరింత భారం అవుతున్నదని వాపోతున్నారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గిగ్ వరర్స్ అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలోనూ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ స్రాప్ మార్గదర్శకాలను మనదగ్గరా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమవ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం చేయకపోవడం, చార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు అంటున్నారు. అందుకే ఆటో, క్యాబ్ మీటర్ చార్జీలను తక్షణం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సూల్వ్యాన్లకు పాఠశాలల వద్ద పారింగ్ సౌకర్యం కల్పించాలని, దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానం అమలు చేయాలని కోరారు. ట్యాక్సీలకు ఏడాదికి రూ.3,500 ఫాస్టాగ్ విధానం, అడ్డాల వద్ద క్యాబ్‌లకు పారింగ్ సౌకర్యం వంటివి కల్పించాలని, డ్రైవర్‌కు ఆపద సంభవించినప్పుడు కంపెనీలు న్యాయసహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఐఆర్డీఏ పెంచిన రవాణా వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం 50 శాతం తగ్గించాలని, జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో ట్యాక్సీలకు ప్రత్యేక పారింగ్ స్టాండ్లు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఈ-చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఆటో, సూల్వ్యాన్ల బంద్‌తో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి జేఏసీతో చర్చలు జరుపాలని నాయకులు కోరుతున్నారు.