37 మంది టీజీబీసీఎల్ ఉద్యోగులకు ప్రమోషన్స్
తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)లో పనిచేస్తున్న పలువురికి ఉద్యోగోన్నతులకు డీపీసీ ఆమోదించిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, టీజీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సీ హరికిరణ్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్)లో పనిచేస్తున్న పలువురికి ఉద్యోగోన్నతులకు డీపీసీ ఆమోదించిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్, టీజీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సీ హరికిరణ్ తెలిపారు. అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 ఆఫీసర్స్‌గా 34 మందికి ఉద్యోగోన్నతులు కల్పించారు. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1గా ఇద్దరికి, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్‌కు గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1గా ఒకరికి ప్రమోషన్ కల్పించారు.
ఇవి కూడా చదవండి..
ఫార్మసీకి డిమాండ్ 96శాతం సీట్ల భర్తీ.. శ్రీదేవసేన
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కూడా ఫార్మసీ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది బీఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో 95శాతం సీట్లు నిండాయి. ఈ మేరకు ఎప్‌సెట్ (బైపీసీ) తుది విడుత సీట్లను మంగళవారం కేటాయించినట్టు ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. కేవలం 399 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈఎస్ఏ పరీక్షల నుంచి బాహ్య మూల్యాకనం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బాహ్య మూల్యాంకనం (ఎక్స్టర్నల్ వాల్యుయేషన్) విషయంపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. అక్టోబర్‌లో జరుగనున్న సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షల నుంచే బాహ్య మూల్యాంకనం అమలు చేయాలని స్పష్టంచేసింది. పరీక్షలు పాఠశాల స్థాయిలోనే జరుగుతాయని పేర్కొన్నది. పరీక్ష పూర్తైన రోజే హెచ్ఎంలు జవాబుపత్రాలను ఎమ్మార్సీకి పంపాలని, ఎంఈవోలు వాల్యుయేటర్లను నియమించి మూల్యాంకనం పూర్తిచేయాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

