ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఏడు, తొమ్మిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపరు రూ.1,000 చొప్పున చెల్లించి ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ ఫలితాలపై చాలెంజ్ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపరుకు రూ.10,000 చొప్పున చెల్లించి వచ్చే నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.