Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతిని బర్త్‌డే పేరుతో తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన బాలానగర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్‌కు చెందిన జే సిద్ధా రెడ్డి(24) ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటూ.. అమ్మాయిలతో నిత్యం చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో అతనికి మణికొండకు చెందిన ఓ యువతి(25) పరిచయమైంది. ఇక ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తరుచుగా మాట్లాడుకునేవారు. నిన్న తన బర్త్ డే ఉందని చెప్పి సిద్ధా రెడ్డి.. ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
అప్రమత్తమైన యువతి సిద్ధారెడ్డి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్ధారెడ్డి నల్లగొండ జిల్లాకు చెందిన వాడని తేలింది. సిద్ధారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.