పీర్జాదిగూడ, జూలై 31: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్భార్ బార్ అండ్ రెస్టారెంట్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారి దేవేందర్ నేతృత్వంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్‌లోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించగా.. ఫ్రిడ్జిలో నిల్వ ఉన్న కుళ్లిన మాంసాహార పదార్థాలు, కిచెన్‌లో చికెన్, చేపలు.. పాచిపోయిన ఇతర ఆహార పదార్థాలు కనిపించాయి.
ఈ ఆహార పదార్థాలను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. పరీక్షల నిమిత్తం ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆహార పదార్థాల ప్రమాణాలు పాటించకుండా కలుషిత పదార్థాలను విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో జీహెచ్ఎంజీ ఫుడ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.