కొండాపూర్, జనవరి 28: ఐటీ కారిడార్‌లో(IT corridor) సరికొత్త క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ(Innovative initiatives) పలువురు ద్విచక్ర వాహనదారులు ‘420’ హెల్మెట్లతో ప్రదర్శనలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం ఐటీ కారిడార్ గచ్చిబౌలి పరిధిలోని ఎమ్మార్ బౌల్డర్ హిల్స్‌లో నిర్వహించిన మ్యూజిక్ ఈవెంట్లో పలువురు 420 ప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. రాయల్ స్ట్రాంగ్ బూమ్ బాక్స్ మ్యూజిక్ ఈవెంట్లో 420 సూచిస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తాజాగా మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జ్ సైతం ఇందుకు వేదిగా మారింది.
పలువురు ద్విచక్ర వాహనదారులు తమ హెల్మెట్లపై 420 హామీలను సూచించేలా ఉన్న వాటిని ధరించి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ 420 పేరుతో(Congress rule) ఈ క్యాంపెయిన్ ఐటీ కారిడార్‌లో కొనసాగుతుందంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడం వైరల్‌గా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాగా, తాజాగా ఐటీ కారిడార్‌లో వినూత్న రీతిలో కొనసాగుతున్న 420 హామీల ప్రచారం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.