మల్కాజిగిరి ఏప్రిల్ 6 : స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి ఆకాశ్ సింగ్ (29), ప్రైవేట్ గా పని చేస్తుంటాడు. శనివారం జడ్‌టీఎస్ గ్రౌండ్లో తన స్నేహితుడు కిషన్ తో మాట్లాడుతుండగా మరో స్నేహితుడు షారుక్ వచ్చి వారితో కూర్చొని మాట్లా డుకుంటున్నారు.
ఇంతియాజ్ షారుక్ కు ఫోన్ చేశాడు. అయితే షారుక్ ఫోన్ ఎత్తక పోవడంతో వీరందరూ జడ్‌టీఎస్ గ్రౌండ్లో ఆకాష్ సింగ్ తో ఉన్నారని అనుమానం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున జడ్‌టీఎస్ గ్రౌండ్‌కు ఇంతి యాజ్ వచ్చాడు. షారుక్ ని ఫోన్ ఎందుకు ఎత్తడంలేదని అడిగాడు. నువ్వు ఆకాశ సింగ్ తో కలిసి తిరిగితే చెడిపోతావు అని హెచ్చరించాడు. వీరు మాట్లాడు తుండగా పక్కనే ఉన్న ఆకాశ సింగ్ ఇంతియాజ్ తో గొడవ పడ్డాడు.
ఇంతియాజ్ పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకని తీసుకొని ఆకాశసింగ్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆకాష్ సింగ్ అక్కడే పడిపోయాడు. తర్వాత ఇంతియాజ్ తన తమ్ముడు షారుక్‌ను తీసుకొని పారిపోయాడు. జరిగిన విషయం కిషన్ ఆకాష్ సింగ్ ఇంట్లో చెప్పడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి తీవ్ర గాయా లతో పడి ఉన్న ఆయనను దగ్గరలోని రాఘవేంద్ర హాస్పిటల్ కి తీసుకుపో యారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు.