కీసర, ఏప్రిల్ 8: ఫీజు చెల్లించలేదని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దారుణానికి ఒడిగట్టింది. విద్యార్థులను బంధించి నానా ఇబ్బందులకు గురి చేసింది. రాంపల్లి దయారలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి చదువున్న నలుగురు విద్యార్థులు స్కూల్ ఫీజు చెల్లించలేదు.
మొత్తం రూ.1.30 లక్షలకు గాను లక్ష రూపాయలు కట్టగా మరో రూ.30 వేలు పెండింగ్లో ఉంది. దీంతో స్కూల్ యాజమాన్యం పెండింగ్ ఫీజు కట్టాలంటూ నాలుగో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను మంగళవారం లైబ్రరీలో బంధించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిలికి చిలికి గాలివానలా ఈ విషయం మారడంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.