హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 20-25 మధ్య జరుగబోయే కేఎస్జీ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్)లో భాగంగా ఆదివారం ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకకు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, శాట్జ్ చైర్మన్ శివసేనా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే మాట్లాడుతూ.. ఏ క్రీడలో అయినా వర్ధమాన ఆటగాళ్లను వెలుగులోకి తేవాలంటే అది క్రీడా జర్నలిస్టులతోనే సాధ్యమవుతుందని, వారి కష్టాన్ని ప్రతిఒక్కరూ గుర్తించి గౌరవించాలన్నారు. ఈ టోర్నీకి శాట్జ్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని శివసేనా రెడ్డి చెప్పారు. అనంతరం కేఎస్జీ చైర్మన్, ఇండి రేసింగ్ టీమ్ ఓనర్ కె. అభిషేక్ రెడ్డి, త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి, లైఫ్ స్పాన్ ప్రతినిధి భరణి 10 జట్ల కెప్టెన్లకు క్యాప్స్ అందించారు.