గౌతంనగర్, జూలై 19 : గతంలో చిన్నపాటి వర్షాలకు భరత్‌నగర్ చౌరస్తా చెరువును తలపించేది.. వర్షాలు వచ్చినప్పుడల్లా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏండ్లనాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షం వచ్చినప్పుడల్లా మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్‌నగర్ చౌరస్తా జలమయంగా మారేది.. ఇక్కడి నీరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 15కాలనీల్లోకి చేరి.. రోడ్లు జలమయమై..ఇండ్లలోకి చేరేవి. సమ స్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే మైనంపల్లి ప్రభుత్వం నుంచి 1.5కోట్ల నిధులను మంజూరు చేయించారు. దీంతో భరత్‌నగర్ చౌరస్తాకు ఇరువైపులా కల్వర్టులు నిర్మించి.. భరత్‌నగర్ చౌరస్తా నుంచి న్యూ వెంకటేశ్వరనగర్ సూధానగర్ మీదుగా బండ చెరువు వరకు భూగర్భడ్రైనేజీని ఏర్పాటు చేసి.. సీసీ రోడ్డును నిర్మించారు. దీనివల్ల భరత్‌నగర్ చౌరస్తాలో వరద, మురుగునీరు నిలువకుండా నేరుగా బండ చెరువులోకి చేరుతుంది. దీంతో స్థానికంగా ఉన్న కాలనీలకు శాశ్వతంగా వరద ముంపు నుంచి విముక్తి కలిగింది.
వరద ముంపు లేకుండా చర్యలు….
మల్కాజిగిరి నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు గతంలో వరద ముంపునకు గురియ్యేవి. నేను ఎమ్మెల్యే అయిన తరువాత సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ..కల్వర్టు, బాక్స్డ్రైన్, ఆర్సీసీ వర్షపు డ్రైన్ నిర్మించేందుకు కోట్లాది రూపాయలను మంజూరు చేయించాను. ఈ నిధులతో పనులు చేపట్టాం. దీంతో దాదాపుగా వరద ముంపు నుంచి చాలా ప్రాంతాలకు విముక్తి కలిగింది. మల్కాజిగిరి ప్రజల సహకారంతో, అందరి ఆశీర్వాదంతోనే అభివృద్ధి పనులు పూర్తి చేశాం. బాక్స్ డ్రైన్ పనులు మొట్టమొదటిసారిగా మల్కాజిగిరిలోనే చేపట్టడం సంతోషం గా ఉంది. అందుకు మంత్రి కేటీఆర్‌కు రుణపడి ఉంటాం.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సహకారంతోనే సమస్య పరిష్కారం..
భరత్‌నగర్ చౌరస్తా చిన్నపాటి వర్షానికి జలమయంగా మారేది. ఈ సమస్య ఏండ్లనాటి నుంచి ఉంది. ఈ సమస్యను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఎవరూ పట్టించుకోలేదు. భరత్‌నగర్ చౌరస్తా నీటమునిగి కింద ఉన్న కాలనీల్లో ఉన్న ఇండ్లలోకి వరదనీరు చేరేవి. రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. ఈ విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు భరత్‌నగర్ చౌరస్తాకు ఇరువైపులా కల్వర్టును నిర్మించి.. న్యూ వెంకటేశ్వరనగర్ నుంచి సుధానగర్ వరకు డ్రైనేజీ ఏర్పాటు చేసి.. సీసీ రోడ్డు వేశారు. దీంతో భరత్‌నగర్ చౌరస్తాకు చేరిన నీరు కల్వర్టుల నుంచి నేరుగా బండ చెరువుకు చేరుతుంది. ఇప్పుడు చుక్కనీరు కూడా నిల్వకుండా పోయింది. దీంతో స్థానికులు ఆనందం వక్తం చేస్తునా
– గౌలికార్ లక్ష్మణ్, భరత్‌నగర్