ముషీరాబాద్ :తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రామకృష్ణ నాట్యమండలి ఆధ్వర్యంలో పౌరాణిక పద్యనాటక వైభవం పేరిట నిర్వహించిన నాటక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన శ్రీకృష్ణాంజనేయ యుద్దం, కర్ణ సందేశం నాటక ప్రదర్శనలు స్రోతలను రంజింప చేశాయి. జోన్నలగడ్డ జగన్మోహనరావు, శివకుమారి, టీ.రాజేశ్వర్రావు, వి.ఏడుకొండలు రసవత్తరంగా పద్యాలను ఆలపించి నాటక ప్రదర్శనను రక్తికట్టించారు.