సుల్తాన్‌బజార్, మే 23: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 2 వేల మైలురాయిని సాధించిన నిమ్స్ యూరాలజీ విభాగం వైద్య బృందాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ మేరకు శనివారం ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కిషన్, కార్యదర్శి డాక్టర్ అశోక్, కోశాధికారి డాక్టర్ దయాల్ సింగ్.. నిమ్స్ యూరాలజీ విభాగం వైద్యులు సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెచ్‌వోడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్, డాక్టర్ రాంరెడ్డితో పాటు ఇతర సీనియర్ సర్జన్లు, అసాధారణమైన బహుళ విభాగాల బృందాన్ని ఓ ప్రకటనలో అభినందించారు.
విజయంవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 2 వేల మైలురాయిని సాధించినందుకు ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర పక్షాన మ్తొతం విభాగానికి అత్యుత్తమ ప్రశంసలతో పాటు అభినందనలు తెలిపారు. నిమ్స్‌లోని యూరాలజీ విభాగం నూతన ఆవిష్కరణలలో కొత్త శిఖరాలను చేరి.. మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు.