తుపాకుల విక్రయ ముఠా గుట్టురట్టు
తుపాకులు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాగుట్టును మలాజిగిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు, బొల్లారం లాఅండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేసి, ఈ ముఠాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. శనివారం మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుమతి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
- రెండు 9 ఎంఎం పిస్టళ్లు.. 19 బుల్లెట్లు స్వాధీనం
తుపాకులు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాగుట్టును మలాజిగిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు, బొల్లారం లాఅండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేసి, ఈ ముఠాకు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. శనివారం మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుమతి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్లోని దయాల్పూర్ గ్రామానికి చెందిన పర్భన్స్ కుమార్(27) ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి చర్లపల్లిలో నివసిస్తున్నాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పర్భన్స్ కుమార్ వ్యసనాలకు అలవాటు పడి అడ్డదారులను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యాడు.అనంతరం విడుదలైన తరువాత అక్రమ ఆయుధాల వ్యాపారం మొదలు పెట్టాడు.
ఇందులో భాగంగా ఈ నెల 10న బీహార్కు వెళ్లిన పర్భన్స్ కుమార్ అకడ సోను అనే వ్యక్తిని సంప్రదించి అతడి వద్ద తకువ ధరకు తుపాకులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందని సీపీ వివరించారు. హైదరాబాద్లో నేరాలకు పాల్పడే వారికి అధిక ధరకు విక్రయించాలని ప్రణాళిక వేసినట్లు సీపీతెలిపారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి జోన్ ఎస్ఓటీ, బాల్లారం పోలీసులు శనివారం ఉదయం బొల్లారం సాదనా మందిర్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పర్భన్స్ కుమార్ను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా అతడి వద్ద రెండు 9 ఎంఎం పిస్టళ్లతో పాటు 19 బుల్లెట్లు, మూడు మ్యాగజైన్లు, ఒక డబుల్ బ్యారెల్ తపంచాతో పాటు బుల్లెట్లు, మొబైల్ ఫోన్ లభించాయి.
దీంతో నిందితుడిపై బొల్లారం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. సీపీ బి.సుమతి, మలాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్, ఎస్ఒటి డీసీపీ కె. మనోహర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో జవహర్నగర్ ఏసీపీ ఎస్ . చక్రపాణి, ఎస్ఓటీ మలాజిగిరి టీమ్ – 1 ఇన్స్పెక్టర్ జి. గణయ్య, బొల్లారం ఎస్హెచ్ఒ ఎన్. రామలక్ష్మణరాజు, ఎస్ఐలు ఎం. సాయికుమార్, జి.లక్ష్మయ్యతో పాటు ఎస్ఓటీ, బొల్లారం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

