Wine Shops | సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అనుమతులు లేకుండా శివారులలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. శనివారం హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ఉద యం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలం టూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని చోట్ల మద్యం దుకాణాలు మూసేశారు. కాగా శివారులలో కొన్ని చోట్ల ప్రైవేట్ అడ్డాలలో మద్యం ఏరులై పా రింది.
బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌కు కూ త వేటు దూరంలో ఉన్న ఒక భవనంలో మద్యం విక్రయాలు జరగడమే కాకుండా, అక్కడే సిట్టింగ్ చేస్తూ మం దుబాబుల జాలీగా గడిపేశారు. శివారుల్లో బెల్ట్ షాప్‌లు చాలా వరకు కొనసాగుతున్నాయి. బెల్ట్షాపులంటే గ్రామీ ణ ప్రాంతాలు, బస్తీలలో దుకాణాలలో కొంత మేర మద్యం సీసాలు తెచ్చి విక్రయిస్తుంటారు. ఆయా పరిధిలోని మద్యం దుకాణాల నుంచి ఈ బెల్ట్‌షాపు నిర్వాహకులు మద్యం కొనుగోలు చేస్తుంటారు.
ఆయా ప్రాంతాలలో ఖాళీ భవనాలను తీసుకొని అం దులో అనధికారికంగా మద్యం దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా ఎక్సైజ్, పోలీసులకు తెలిసే జరుగుతున్నాయంటూ స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నెల వారీగా మా ముళ్లు తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారని స్థానికు లు ఆరోపిస్తున్నారు. అక్రమ వ్యాపారాలు సాగుతు న్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ 365 రోజులు 24 గంటలు మద్యం దొరుకుతుందంటూ స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.
అయితే తమ ఉన్నతాధికారులకు తెలిస్తే తమకు సమస్యలొస్తాయం టూ స్థానిక అధికారులు దుకాణదారులతో మాట్లాడితే.. సార్ మా బాస్‌లు చూసుకుంటారు.. మాబాస్ అధికార పార్టీకి చెందిన వాడే. ఆయనుండగా మీ వద్దకు ఎవరు రారు.. మీరు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకండి.. మీకు ఏమీ కావాలో చెప్పండి అది పంపిస్తామంటూ ఎక్కడికక్కడే అక్రమ వ్యా పారులు అధికారులను డబ్బుతో కట్టడి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి పెడితే అక్రమ దందాలు బయటకు వస్తాయంటూ ప్రజలు చెబుతున్నారు.